- Home
- national
కాంగ్రెస్ పార్టీని వదిలేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు : జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని వదిలేసినందుకు తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. వ్యక్తిగత సామర్థ్యాలను బట్టి బీజేపీలో పదవులు లభిస్తాయని చెప్పారు. మోదీ, అమిత్ షా, నడ్డా వంటి నాయకులతో కలిసి ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడలేదని సింధియా చెప్పారు.