నితిన్ 'చెక్' త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

Admin 2020-10-25 00:15:13 entertainmen
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ తాజాగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'చెక్' అనే టైటిల్ని కూడా నిర్ణయించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా వదిలారు. నితిన్ రెండు పాత్రలను పోషిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రకథ చదరంగం ఆటలా ఎత్తులకు పైఎత్తులతో సాగుతుందట. అందుకే, 'చెక్' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.