తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: చిరంజీవి

Admin 2020-10-24 20:16:13 entertainmen
తెలంగాణ ఆడపడుచులు అంబరాన్నంటే ఆనందంతో జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

"బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను."