నేడు బుల్లితెర పైకి సమంత

Admin 2020-10-25 17:59:13 entertainmen
అక్కినేని ఇంటి కోడలు సమంత. ప్రస్తుతం బిగ్ బాస్ ను తన మాటల మాయాజాలంతో నడిపిస్తున్న నాగార్జున, ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది. దీంతో తిరిగి నాగార్జున అందుబాటులోకి వచ్చేంత వరకూ షోను నడిపించే బాధ్యతలను తన కోడలు సమంతకు నాగ్ అప్పగించేశారు.

సమంత బుల్లితెరపైకి వస్తారని భావించినా, ఆమెను కేవలం ప్రోమోకు మాత్రమే బిగ్ బాస్ పరిమితం చేశాడు. ఆదివారం నాడు ఆమె టీవీ స్క్రీన్ పై కనిపిస్తుందని చెబుతూ, ప్రతి ఒక్కరిపై సమంత అభిప్రాయాలను చూపించాడు. నేడు దసరా పండగ కావడంతో, ఈ వారం ఎలిమినేషన్ కూడా ఏమీ ఉండక పోవచ్చని షో షూటింగ్ ను చూసిన లీక్ వీరులు సోషల్ మీడియాలో చెబుతున్నారు.