నెగటివ్‌ పాత్రలో రమ్యకృష్ణ

Admin 2020-10-28 15:13:13 entertainmen
రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ పాత్రలను మాత్రమే పోషిస్తోంది. పాత్రలో ఏదైనా విషయం ఉంటేనే ఆమె ఒప్పుకుంటోంది.
తన స్థాయికి తగ్గా పాత్రలకే ఓకే చెబుతోంది. తాజాగా మరో పవర్ ఫుల్ పాత్రకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సాయితేజ్ హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం. ఈ పాత్ర నెగటివ్ ఛాయలతో సాగుతుందని అంటున్నారు.