దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ అజ్ఞాతంలో

Admin 2020-10-31 13:10:13 entertainmen
ఇప్పటికే దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధకపూర్ లను ఎన్సీబీ విచారించింది. మరోవైపు దీపికా పదుకునే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంట్లో జరిపిన సోదాల్లో డ్రగ్స్ లభించాయి. ఆమెతో పాటు దీపికా పదుకునేకు ఎన్సీబీ సమన్లను జారీ చేసింది. అయితే సమన్లు జారీ చేసినప్పటి నుంచి కరిష్మా ప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కరిష్మా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 23 మందిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.