నేడు ముంబైలో గౌతమ్ తో కాజల్ పెళ్లి

Admin 2020-10-30 22:40:13 entertainmen
వెండితెర మీద కథానాయికగా తన గ్లామర్ వెదజల్లుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కాజల్ అగర్వాల్.. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కూడా వెలుగొందింది. ఇటీవల కొత్త అమ్మాయిల తాకిడి ఎక్కువవడంతో ఆమె డిమాండ్ కొంతమేర తగ్గింది. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని ఈ రోజు ముంబైలో సింపుల్ గా జరిగే వేడుకలో ఆమె పెళ్లాడబోతోంది.ఎవరైనా సరే పెళ్లయ్యాక హనీమూన్ కి వెళ్లి హ్యాపీగా గడపడానికి తమ వృత్తిపని నుంచి బ్రేక్ తీసుకుంటారు. అయితే, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కాజల్ హనీమూన్ ట్రిప్ ఏదీ ప్లాన్ చేసుకోలేదు. చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూలును నవంబర్ 2 నుంచి హైదరాబాదులో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ షూటింగులో పాల్గొంటారు. దీంతో నవంబర్ రెండో వారంలో కాజల్ ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతుందని సమాచారం.