20 మంది కార్మికులు, నెల రోజులు పాటు శ్రమ : కాజల్ పెళ్లి డ్రెస్

Admin 2020-11-02 13:12:13 entertainmen
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూను పెళ్లాడి, మిస్సెస్ కిచ్లూగా మారిపోయిందన్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో ఆమె గులాబీ రంగు లెహెంగాను ధరించి, అప్సరసలా కనిపించింది. దీని డిజైనింగ్ రహస్యాన్ని డిజైనర్ అనామికా ఖన్నా, తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. 20 మంది కార్మికులు, నెల రోజులు పాటు శ్రమించి దీన్ని తయారు చేశారని ఆమె తెలిపింది. ఫ్లోరల్ డిజైన్ ఎంబ్రాయిడరీలో దీన్ని తయారు చేశామని వెల్లడించింది. ఆమె ధరించిన ఆభరణాలను సునీతా షెకావత్ చేతితో తయారు చేశారని పేర్కొంది.