తెలుగులో డబ్బింగ్ చెప్పిన : ఆదాశర్మ

Admin 2020-11-02 20:02:13 entertainmen
ముంబై భామలు తెలుగులో డబ్బింగ్ చెప్పి, ప్రశంసలు కూడా పొందారు. ఈ జాబితాలో ఇప్పుడు మరో కథానాయిక ఆదాశర్మ కూడా చేరింది. తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. నూతన దర్శకుడు విప్ర దర్శకత్వంలో ఆదాశర్మ కథానాయికగా '?' (క్వశ్చన్ మార్క్) పేరుతో ఓ సినిమా రూపొందుతోంది.

సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'మన పాత్రకు మనం డబ్బింగ్ చెప్పుకుంటేనే దానికి సంపూర్ణత్వం వస్తుంది. అందుకే, ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. భాష సరిగా అర్థమైతే డబ్బింగ్ మంచి ఎక్స్ ప్రెషన్స్ తో చెప్పచ్చు. నాకు తెలుగు బాగా వచ్చేసింది. అందుకే, ఒక రోజులోనే డబ్బింగ్ పూర్తిచేసేశాను' అని చెప్పింది.