పవన్ కల్యాణ్ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టారు

Admin 2020-11-02 19:55:13 entertainmen
పవన్ కల్యాణ్ కూడా నిన్న షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రంలో ఆయన నటిస్తున్న సంగతి విదితమే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం జరిగింది. గత నెలలోనే ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభించగా.

నిన్న పవన్ షూటింగులో జాయిన్ కావడంతో సెట్లో సందడి నెలకొంది. కోర్టు సీనుకు సంబంధించిన సన్నివేశాలను పవన్ పై నిన్న చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో శ్రుతి హాసన్, నివేద థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తో కలసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.