- Home
- bollywood
అర్నాబ్ అరెస్ట్‌పై నటి కంగన మండిపాటు
అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను బాలీవుడ్ ప్రముఖ నటి కంగన రనౌత్ తీవ్రంగా ఖండించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగన రనౌత్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నానని పేర్కొన్న కంగన.. ఎంతమంది గొంతులు కోస్తారు? ఎంతమంది గళాన్ని అణచివేస్తారు? ఎంతమందిని జుట్టు పట్టుకుని అవమానిస్తారని ప్రశ్నల వర్షం కురిపించింది.ముంబైలో మే 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అన్వయ్ రాసిన ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యమైంది. అర్నాబ్‌తో పాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే ఇద్దరు వ్యక్తులు తనకు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇవ్వలేదని దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారు. ఈ కేసులోనే పోలీసులు అర్నాబ్‌ను అరెస్ట్ చేశారు.