'లవ్ మాక్ టైల్' రీమేక్ లో సత్యదేవ్, తమన్నా

Admin 2020-11-06 19:16:13 entertainmen
అందాలతార తమన్నా హీరోయిన్ గా తెలుగులో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. నూతన దర్శకుడు నాగశేఖర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి. ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా ఉందట. ఆ పాత్ర కోసం తాజాగా మేఘా ఆకాశ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 'లై', 'చల్ మోహన రంగా' వంటి తెలుగు చిత్రాల ద్వారా మేఘా ఆకాశ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా ఉందట. ఆ పాత్ర కోసం తాజాగా మేఘా ఆకాశ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 'లై', 'చల్ మోహన రంగా' వంటి తెలుగు చిత్రాల ద్వారా మేఘా ఆకాశ్ ప్రేక్షకులకు సుపరిచితమే.

కన్నడలో వచ్చిన 'లవ్ మాక్ టైల్' హిట్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, చిత్రం యూనిట్ వాటిని ఒట్టి పుకార్లుగా కొట్టిపారేసింది.