బాలయ్య సరసన చిన్నపిల్లలా ఉందన్న భావన

Admin 2020-11-08 20:27:13 entertainmen
బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో చిత్రానికి ఇంకా కథానాయిక సెట్ అయినట్టు కనిపించడం లేదు. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు ఎందరినో పరిశీలించి ఆఖరికి ఇటీవలే మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. కన్నడ భాషల్లో పలు సినిమాలలో నటించిన ప్రయాగకు ఇది తొలి తెలుగు సినిమా కావడంతో, ఆమె కూడా దీనిని మంచి ఎంట్రీ అని భావించిందట. తాజాగా ఆమెను ఈ ప్రాజక్టు నుంచి తప్పించినట్టు వార్తలొస్తున్నాయి. చూడడానికి బాలకృష్ణ సరసన ఆమె జోడీ సరిపోలేదని, బాగా చిన్నపిల్లలా ఉందనీ దర్శక నిర్మాతలకు అనిపించిందట. ఇప్పుడు ఆ పాత్రకి మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోపక్క, సెకండ్ హీరోయిన్ పాత్రకు మాత్రం పూర్ణను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. 'సింహా', 'లెజండ్' చిత్రాల తర్వాత మళ్లీ బాలకృష్ణతో బోయపాటి ఈ చిత్రాన్ని చేస్తుండడంతో ఈ ప్రాజక్టుకు బాగా క్రేజ్ వచ్చింది. లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది.