ఇటీవలే ప్రియుడిని వివాహమాడిన కాజల్

Admin 2020-11-08 20:22:13 entertainmen
సంసార జీవితంలోకి ప్రవేశించిన అందాల కథానాయిక కాజల్ అగర్వాల్ వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని ఇప్పటికే చెప్పింది. అటు సంసారం.. ఇటు వృత్తి రెంటికీ సమ ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇక కరోనా నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతోంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ రోజు చిన్న హింట్ ఇచ్చింది. బ్యాగేజి, పాస్ పోర్టుల ఫొటోలు పోస్ట్ చేసి.. 'బ్యాగులు సర్దుకున్నాం'.. 'బయలుదేరడానికి సిద్ధంగా వున్నాం' అంటూ ఆ ఫొటోలపై క్యాప్షన్స్ ఇచ్చింది. హనీమూన్ కి వెళుతున్న విషయాన్ని అలా చెప్పకనే చెప్పేసిందన్నమాట.