రజనీకాంత్ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు

Admin 2020-11-09 13:13:13 entertainmen
కృషి, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక సాధారణ బస్ కండక్టరుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్.. సినిమాలలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ అగ్ర హీరోగా రూపాంతరం చెందిన వైనం అందరికీ స్ఫూర్తిమంతం. ఆయన ఎదుర్కున్న కష్టనష్టాలు .. పడ్డా అవమానాలు .. ఎన్నో! అయితే, తన గమ్యాన్ని చేరుకోవడంలో ఇవేమీ ఆయనను వెనక్కులాగలేదు. పైపెచ్చు, ఆయనలో మరింతగా కసిని పెంచాయి. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి గత కొన్నాళ్లుగా రజనీ బయోపిక్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సబ్జెక్టుపై ఎంతో పరిశోధన కూడా చేశాడు. చిత్ర నిర్మాణానికి సర్వం సిద్ధమైనట్టు కోలీవుడ్ సమాచారం. పైగా ఇందులో రజనీకాంత్ గా ఆయన అల్లుడు, యువ కథానాయకుడు ధనుష్ నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ధనుష్ కూడా రజనీకి వీరాభిమాని కావడంతో, ఆ పాత్ర పోషించడానికి ఆయన ఆసక్తి, ఉత్సాహం చూపిస్తున్నట్టు చెబుతున్నారు.