- Home
- tollywood
జో బైడెన్ ను ఉద్దేశించి కంగన సంచలన వ్యాఖ్యలు
జో బైడెన్ ను ఉద్దేశించి బాలీవుడ్ నటి కంగన రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఒక గజినీతో పోల్చారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ అని వ్యాఖ్యానించారు. ఆయనకు ఇంజెక్ట్ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి బైడెన్ ఉండరని అన్నారు. ఇతర మహిళలకు కూడా ఆమె మార్గాన్ని చూపిస్తుందని కమలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమల మాట్లాడుతూ... తాను ఈ బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు... కానీ, చివరి మహిళను మాత్రం కాదని అన్నారు.