- Home
- tollywood
సరదాగా సాగుతున్న బిగ్ బాస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ కాసేపు సరదాగా,కాసేపు సీరియస్ గా సాగిపోతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే యాంకర్ సుమతో పాటు అఖిల్, సమంత తదితరులు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఇక, బిగ్ బాస్ సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్న వేళ, చిరంజీవికి కరోనా వచ్చిందంటూ ఆయన హోమ్ క్వారంటైన్ కు వెళ్లడం, అంతకు రెండు రోజుల ముందే నాగార్జున, చిరంజీవి కలవడంతో, నాగ్ సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే, నాగ్ కు నెగటివ్ వచ్చింది. దీంతో ఆయన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక, ఈ వారాంతంలో నాగ చైతన్య కనిపిస్తారని తెలుస్తోంది.