- Home
- tollywood
నా స్థానంలో ఇతర హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారు : తాప్సీ
తాప్సీ తాను సినీరంగ ప్రవేశం చేసినప్పుడు ఎదుర్కొన్న అవమానాల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందం విషయంలో తాను ఇండస్ట్రీలో అనేకసార్లు అవమానాలు ఎదుర్కొన్నానని, తాను అందంగా లేనని కొంతమంది సినీ హీరోల భార్యలు తనను ఇష్టపడేవారు కాదని తెలిపింది. తమ భర్త పక్కన అందంగా లేని తనలాంటి అమ్మాయి హీరోయిన్‌గా కనిపించడాన్ని సిగ్గుచేటుగా భావించేవారని చెప్పింది. దీంతో వారు తన స్థానంలో తమ భర్తల పక్కన ఇతర హీరోయిన్లకు అవకాశం ఇప్పించేవారని చెప్పుకొచ్చింది.ఇదే కారణంతో కొందరు నిర్మాతలు కూడా తనను హీరోయిన్‌గా తీసుకోకపోయేవారని చెప్పింది. అప్పట్లో తాను నటించిన ఓ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ కంటే తన ఇంట్రడక్షన్ సీన్ బాగా వచ్చిందని ఆమె తెలిపింది.