ఎన్టీఆర్ 30 లో కేతికా శర్మ

Admin 2020-11-19 12:21:13 entertainmen
రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా కేతికా శర్మ మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుంది. రొమాంటిక్ సినిమా పోస్టర్స్ మరియు టీజర్ చూసిన తర్వత అమ్మడికి వరుసగా అవకాశాలు వెళ్లువెత్తుతున్నాయి. ఈమెకు ఏకంగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నుండి పిలుపు వచ్చినట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్రివిక్రమ్ మార్చి నుండి ఎన్టీఆర్ 30 సినిమాను మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. Jr ఎన్టీఆర్ కు జోడీగా ఈమె బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడట. త్రివిక్రమ్ నిర్ణయాన్ని పూర్తిగా ఎన్టీఆర్ సమర్థిస్తాడు. ఎన్టీఆర్ 30 లో కేతికా శర్మ ఎంపిక అనేది సరైన నిర్ణయమే అనే అభిప్రాయం నందమూరి అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమాలో కేతికా నటించబోతున్నట్లుగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.