సూర్య కొత్త సినిమాపై మహేశ్ బాబు ప్రశంసల జల్లు..

Admin 2020-11-19 20:11:13 entertainmen
సూర్య కొత్త సినిమా 'ఆకాశం నీ హద్దురా' పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనిపై మహేశ్ బాబు స్పందిస్తూ.. ‘ఆకాశం నీ హద్దురా స్ఫూర్తిదాయకమైన సినిమా. తమ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేశ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. మహేశ్ బాబు నటిస్తోన్న సర్కారు వారిపాట సినిమా కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు. కాగా, మధ్య తరగతి యువకుడు పేదల కోసం అతి తక్కువ ధరలకు విమాన ప్రయాణ సౌకర్యాన్ని ఎలా కల్పించేలా చేస్తాడన్న కథతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో సూర్య నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.