- Home
- tollywood
నిర్ణయానికి కట్టుబడిన లావణ్య త్రిపాఠి
మన సినిమా తారలు సినిమాలు చేస్తూనే, మంచి పారితోషికాన్ని అందించే వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తూ వుంటారు. అయితే, కథానాయిక లావణ్య త్రిపాఠి మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వుంటుందట. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారం చేయనని కరాఖండీగా చెప్పేస్తోంది. ఈమధ్య భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పటికీ అలాంటి కొన్ని ఆఫర్లను ఈ ముద్దుగుమ్మ తిరస్కరించిందట.