సాయితేజ్, నభా నటేశ్ జంటగా సోలో బ్రతుకే సో బెటర్

Admin 2020-11-28 21:33:32 entertainmen
సాయితేజ్, నభా నటేష్ జంటగా నటించిన చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సుబ్బు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ ఈ క్రిస్మస్ కానుకగా వస్తోంది. అది కూడా థియేటర్లలో రిలీజవుతోంది.జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేటర్లలో విడుదల చేస్తోంది. ఈ మేరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. సాయితేజ్ ట్వీట్ చేస్తూ, థియేటర్లలో ఆడియన్స్ ఈలలు, చప్పట్లు వినేందుకు ఆగలేకపోతున్నానని పేర్కొన్నారు.