- Home
- sports
ఆసీస్ ముందు 303 పరుగుల లక్ష్యం
ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న మూడవ వన్డే మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆశించిన మేరకు రాణించలేదు. అయినప్పటికీ 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన హార్థిక పాండ్యా, రవీంద్ర జడేజా ధాటిగా ఆడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. మొదటి రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచులో 374, రెండో మ్యాచులో 389 పరుగులు చేసి భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.