- Home
- tollywood
తమిళ సినిమాలో విక్రమ్ సరసన ఆఫర్ : రాశిఖన్నా
సినిమా రంగంలోకి ప్రవేశించి ఐదేళ్లయినా, ఈ ముద్దుగుమ్మ కథానాయికగా దూసుకుపోయింది లేదు. ఏవో సినిమాలు చేస్తోంది కానీ, ఆమె రేంజ్ మాత్రం పెరగడం లేదు. ఇటీవలి కాలంలో 'వెంకీమామ', 'ప్రతి రోజు పండగే' వంటి హిట్ సినిమాలలో నటించినప్పటికీ ఈ భామకు టాలీవుడ్ నుంచి అంతగా ఆఫర్లు లేవనే చెప్పాలి. తమిళంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఆమె బిజీగా వుంది. ప్రస్తుతం అక్కడ మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ మంచి ఫామ్ లో వుంది. ఈ క్రమంలో స్టార్ హీరో విక్రమ్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు తెలుస్తోంది