రూ. 100 ఇస్తే ఇలాంటి వారు చాలా మంది వస్తారని వ్యాఖ్య : కంగనా రనౌత్

Admin 2020-12-05 11:33:32 entertainmen
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానాల నుంచి వచ్చిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వంద రూపాయలు ఇస్తే ఇలాంటి మహిళలు చాలా మంది వస్తారని కంగన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని తాను కూడా చాలా మందిని తీసుకురాగలనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ కంగనకు నోటీసులు పంపింది.