- Home
- tollywood
కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిన మహేశ్
ఒక మంచి హిట్ సినిమా తీస్తే చాలు.. దర్శకుడు పరశురామ్ కి మహేశ్ బాబు అలాగే ఛాన్స్ ఇచ్చాడు. 'సర్కారు వారి పాట' కథ నచ్చడంతో మహేశ్ వెంటనే 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ కి ఓకే చెప్పేశాడు.తాజాగా మరో దర్శకుడు వెంకీ కుడుములకు కూడా మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆమధ్య నితిన్ హీరోగా 'భీష్మ' వంటి సూపర్ హిట్ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ కథను మరో హీరో రామ్ చరణ్ తిరస్కరించాడట. మహేశ్ ని కలవడానికి ముందు ఈ కథను చరణ్ కి వినిపించాడని, అయితే, ఆయనకు ఆ కథ నచ్చక 'నో' చెప్పాడని అంటున్నారు. దాంతో వెంకీ అదే కథను మహేశ్ కి చెప్పాడట. ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.