ఇటీవలే ప్రారంభించిన తన సెకండ్ ఇన్నింగ్స్

Admin 2020-12-12 15:59:17 entertainmen
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలలో కథానాయికగా నటించి, గ్లామర్ పాత్రలకు పక్కా చిరునామాగా నిలిచిన నిన్నటితరం హీరోయిన్ సిమ్రన్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.ది నంబీ ఎఫెక్ట్' సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మరో చిత్రాన్ని అంగీకరించింది.హిందీలో హిట్టయిన 'అంధాధున్' చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తుంటే.. తమిళంలో ప్రశాంత్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడీ తమిళ రీమేక్ లో సిమ్రన్ కీలక పాత్ర పోషించనుంది. హిందీ ఒరిజినల్ లో టబు పోషించిన పాత్రను తమిళ వెర్షన్లో సిమ్రన్ చేస్తోంది. ఈ విషయాన్ని సిమ్రన్ కూడా తాజాగా ధ్రువీకరించింది.