- Home
- tollywood
వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన నాని?
థియేటర్ కి ప్రత్యామ్నాయంగా ఈ ఓటీటీ నిలబడుతోంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఈ ప్లాట్ ఫామ్ ప్రాధాన్యం వెల్లడైంది. థియేటర్లు మూతబడిన కారణంగా రిలీజ్ కాకుండా ఆగిపోయిన ఎన్నో సినిమాలు ఓటీటీ ద్వారా వెలుగుచూశాయి. నేపథ్యంలో పలువురు తారలు ఇటు సినిమాలు చేస్తూనే... అటు ఓటీటీ సంస్థల కోసం వెబ్ సీరీస్ వంటివి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు వీటితో బిజీగా వున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఓ వెబ్ సీరీస్ లో నాని ప్రధాన పాత్ర పోషించనున్నట్టు సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని 'టక్ జగదీశ్' సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో పూర్తికానుంది. దీని తర్వాత 'శ్యామ్ సింగరాయ్' సినిమా చేస్తాడు. ఆ తర్వాత 'అంటే సుందరానికి' అనే సినిమా చేయాల్సివుంది. దాని తర్వాత నెట్ ఫ్లిక్స్ సీరీస్ షూటింగ్ చేస్తాడట.