- Home
- bollywood
బాలీవుడ్ నటి, మోడల్ ఆర్యా అనుమానాస్పద మృతి
బాలీవుడ్‌లో డర్టీ పిక్చర్, లవ్ సెక్స్ ఔరా ధోకా వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మోడల్ ఆర్యా బెనర్జీ (33) ఆత్మహత్య చేసుకుంది. ఆమె దివంగత సితార్ విధ్వాంసుడు నిఖిల్ బందోపాధ్యాయ కుమార్తె. పనిమనిషికి అనుమానం వచ్చి, చుట్టుపక్కలవారి సాయంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూశారు. మంచంపై అపస్మారక స్థితిలో ఉన్న ఆర్య బెనర్జీ కనపడింది. ముఖంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆమె ఇంట్లో శాంపుల్స్ సేకరించారని పోలీసులు చెబుతున్నారు. కొంతకాలంగా ఆర్యా ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.