- Home
- tollywood
తెలుగులో అధిక డిమాండ్ వున్న నాయిక
ప్రస్తుతం తెలుగులో ఎక్కువ డిమాండ్ వున్న ఇద్దరు, ముగ్గురు కథానాయికల్లో పూజ హెగ్డే కూడా వుంది. వరుస విజయాలు వరించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. పారితోషికం బాగా పెంచేసినా కూడా 'ఫర్వాలేదు.. డేట్స్ ఇయ్యి చాలు' అంటున్న నిర్మాతలు కూడా వున్నారు.
ప్రస్తుతం తెలుగులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'రాధే శ్యామ్' సినిమాలలో నటిస్తున్న పూజ.. మరోపక్క బాలీవుడ్ లో కూడా బిజీగా వుంది. అక్కడ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతున్న 'కభీ ఈద్ కభీ దివాలి' సినిమాలోనూ, రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న 'సర్కస్' చిత్రంలోనూ పూజ ఇపుడు హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా రెండు భాషల్లోనూ ఒకేసారి బిజీగా ఉండడం పట్ల ఈ బ్యూటీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.