హీరోగా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్న సోహెల్!

Admin 2020-12-24 20:15:10 entertainmen
బిగ్‌బాస్-4 తెలుగు ఫేం సోహెల్‌ ఓ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆ సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది. జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ వంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి సోహెల్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. హీరోగా సోహెల్ కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్నాడు. బిగ్‌బాస్‌లో సోహెల్ గ్రాండ్ ఫినాలె వరకు వెళ్లి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. చివరకు ప్రైజ్ మనీ తీసుకుని బిగ్ బాస్ నుంచి వైదొలిగాడు. సోహెల్ చేయనున్న సినిమాను ప్రమోట్ చేస్తామని బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలెలో చిరంజీవి, నాగార్జున చెప్పారు.