తన సినిమాలు రీమేక్ చేస్తే, వాటిలో ఏ హీరోలు సరిపోతారో చెప్పిన చిరంజీవి!

Admin 2020-12-27 22:44:10 entertainmen
అల్లు అరవింద్‌కు చెందిన ‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఈ షో ప్రసారమైంది. ఇందులో సమంతతో చిరు చాలా సరదాగా మాట్లాడారు. సమంత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. చిరంజీవి పాత సినిమాలను రీమేక్ చేస్తే ఆయా సినిమాల్లో హీరోలుగా ఎవరెవరు సరిపోతారని సామ్ అడిగింది. జగదేక‌వీరుడు, అతిలోకసుందరి సినిమాకి ‌రామ్‌చరణ్ లేక మహేశ్ బాబు సూట్ అవుతారని చిరు చెప్పారు. హీరోయిన్‌గా సమంత నటించాలని అన్నారు. గతంలో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాకు పవన్ కల్యాణ్‌ హీరోగా సరిపోతాడని చెప్పారు.