- Home
- tollywood
ఫొటో పోస్ట్ చేసిన అమల, చైతూ
సకుటుంబ సపరివార సమేతంగా సినీనటుడు అక్కినేని నాగార్జున తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. అమల, నాగచైతన్య, సమంత, అఖిల్, సుమంత్, సుశాంత్‌తో పాటు నాగార్జున ఫ్యామిలీ అంతా ఒక్క చోట కలిసి ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోను నాగచైతన్య నిన్న ఫేస్‌బుక్ స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. అక్కినేని కుటుంబాన్నంతా ఒక్కచోట చూస్తోన్న అభిమానులు మురిసిపోతున్నారు. క్రిస్మస్ సందర్భంగా వారందరూ ఒకే చోట కలిసి ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నాగార్జున టాలీవుడ్‌లో అగ్రహీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఆయన భార్య అమల కూడా పలు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కుమారుడు నాగ చైతన్య, అఖిల్ కూడా సినిమాల్లో హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.