ఆస్ట్రేలియా-భారత్ మధ్య రెండో టెస్టు

Admin 2020-12-27 22:49:10 entertainmen
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ అజింక్యా రహానె సెంచరీ బాదాడు. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇతర టీమిండియా బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమవుతున్నప్పటికీ రహానె క్రీజులో నిలదొక్కుకుని పరుగుల వరద పారిస్తూ టెస్టుల్లో 12వ శతకం సాధించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా, శుభ్‌మాన్ గిల్ 45, చటేశ్వర్ పుజారా 17, హనుమ విహారి 21, రిషబ్ పంత్ 29 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానె 104 (200 బంతుల్లో), రవీంద్ర జడేజా 40 పరుగులతో ఉన్నారు. ఎక్స్ ట్రాల రూపంలో భారత్‌కు 21 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 91.3 ఓవర్ల వద్ద 277/5గా ఉంది.