అహిషోర్ దర్శకత్వంలో నాగార్జున 'వైల్డ్ డాగ్'

Admin 2021-01-03 18:31:14 entertainmen
లాక్ డౌన్ సమయంలో మరోదారి లేక చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద విడుదల చేసేశారు. సినిమాను బట్టి ఆయా నిర్మాతలకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. కొందరు తమ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. నాగార్జున 'వైల్డ్ డాగ్' చిత్రం చేశారు. ఇన్వెస్ట్ గేటివ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంతకుముందే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ రూ.27 కోట్లను ఆఫర్ చేసిందనీ, దాంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి ఇచ్చేశారని తెలుస్తోంది.