- Home
- tollywood
చిరంజీవి 'ఆచార్య' సినిమా గురించి ఆసక్తికర అప్ డేట్స్!
చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేశారు. దాదాపు 20 ఎకరాల్లో ఈ సెట్ ను నిర్మించారు. చిరంజీవిపై చిత్రీకరిస్తున్న సోలో సన్నివేశాలు ఈనెల 10న పూర్తి కాబోతున్నాయి. ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతి తర్వాత చరణ్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తారట. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చరణ్ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆయన షూటింగ్ లో జాయిన్ అవుతాడు. దాదాపు 30 రోజుల పాటు చరణ్ షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం.