యంగ్ రెబ‌ట్ స్టార్ ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌ల‌

Admin 2021-01-03 18:41:14 entertainmen
'జాంబి రెడ్డి' సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. క‌రోనా గురించి ప్ర‌ధాని మోదీ చెప్పిన జాగ్ర‌త్త‌ల వీడియోతో ఈ ట్రైల‌ర్ ప్రారంభం అవుతోంది. రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. క‌రోనా డైలాగుల‌తో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైల‌ర్ కొనసాగుతోంది. జాంబి జానర్ సినిమా రావ‌డం ఇదే తొలిసారి. ఈ సంక్రాంతికి అల్లుళ్లు కాకుండా జాంబీలు వస్తున్నారంటూ డైలాగులు ఉన్నాయి. పూర్తి వినోదాత్మ‌కంగా ఈ సినిమా సీన్లు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.