- Home
- tollywood
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజక్ట్!
తాము ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ప్రాజక్ట్ అంటూ ఒకటి వుంటుంది. ఫలానా పాత్ర పోషించాలని, ఫలానా బ్యాక్ డ్రాప్ లో ఎప్పటికైనా సినిమా చేయాలని ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ కోరుకుంటూ వుంటారు. ఆ కల కొందరికి త్వరగా నెరవేరితే, కొందరికి ఆలస్యంగా నెరవేరుతూ వుంటుంది. స్పోర్ట్స్ డ్రామా ఒకటి చేయాలన్నది నా చిరకాల కోరిక. వాస్తవానికి గతంలో ఆర్బీ చౌదరి గారి బ్యానర్లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో 'మెరుపు' అనే సినిమాను స్టార్ట్ చేశాం కూడా. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు, ఆగిపోయింది. అప్పటి నుంచీ కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం చూస్తున్నాను. అయితే, ఇంతవరకు నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ మాత్రం దొరకలేదు. వస్తే కనుక కచ్చితంగా చేస్తాను' అని చెప్పాడు చరణ్.