డ్రగ్స్ డీలర్లతో రియా వాట్సప్‌ చాటింగ్‌

Admin 2020-08-26 23:43:41 entertainmen
బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ కొనసాగుతోంది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడిని సీబీఐ అధికారులు విచారించారు. ఆమె వాట్సప్‌ చాటింగ్‌పై కూడా అధికారులు దృష్టి పెట్టగా ఆమె డ్రగ్స్ డీలర్లతోనూ సంప్రదింపులు జరిపేదని తేలింది. డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన చాటింగ్‌ సంభాషణల సమాచారాన్ని ఈడీ అధికారులు సీబీఐ అధికారులకు ఇచ్చారు. డ్రగ్‌ డీలర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌరవ్‌ ఆర్యతో ఆమె సంప్రదింపులు జరిపింది. గౌరవ్‌తో 2017 మార్చి 8 నుంచి ఆమె సంప్రదింపులు జరుపుతోంది. అత్యంత ప్రభావితం చేసే డ్రగ్స్ మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి ఆమె ఆరా తీసింది. మరికొందరు డ్రగ్స్ డీలర్లతోనూ ఆమె సంప్రదింపులు జరిపింది.