సినిమా హిట్టవ్వడంతో పలు ఆఫర్లు

Admin 2021-02-20 15:10:35 entertainmen
'ఉప్పెన' సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించే దిశగా ఇది పయనిస్తోంది. తాజాగా కృతిశెట్టికి ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడ వెలువడింది. ఊరమాస్ సినిమాగా ఇది తెరకెక్కుతోందని నిర్మాత శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు.