- Home
- tollywood
బ్లడ్ టెస్ట్ కు రియా ఏ సమయంలోనైనా సిద్ధమేనన్న ఆమె తరపు లాయర్!
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి సుశాంత్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిపై తొలి నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సీబీఐ విచారణలో డ్రగ్స్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు తేలింది. రియా ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆమె లాయర్ తెలిపారు. రక్త పరీక్షలు నిర్వహిస్తే విషయం తేలిపోతుందని... బ్లడ్ టెస్ట్ కు రియా ఏ సమయంలోనైనా సిద్ధంగానే ఉన్నారని చెప్పారు. మరోవైపు, సీబీఐ కూడా తన విచారణలో డ్రగ్స్ కోణాన్ని పరిగణనలోకి తీసుకోబోతోందని తెలుస్తోంది.