- Home
- tollywood
ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానున్న చిత్రం : వకీల్ సాబ్
పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. ఇటీవల విడుదలైన 'వకీల్ సాబ్' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 85 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే, కరోనా కారణంగా థియేటర్లకు వెళ్లేందుకు సినీ అభిమానులు కొంత సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఓటీటీలో సినిమాను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.