తాజాగా లైన్లోకి వచ్చిన అనిల్ రావిపూడి

Admin 2020-08-28 13:32:41 entertainmen
స్టార్ హీరోలు ఒక సినిమా సెట్స్ లో ఉండగానే, తదుపరి చిత్రాన్ని కూడా సెట్ చేసుకుంటూ వుంటారు. మహేశ్ బాబు కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తుంటాడు. వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటూ వెళతాడు. అయితే, ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రాన్ని చేస్తున్న మహేశ్.. తన తదుపరి చిత్రం విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయంలో కొందరు దర్శకులు చెప్పిన కథలను మహేశ్ విన్నట్టు వార్తలొచ్చాయి. కానీ, తనను ఆకట్టుకునే కథ మాత్రం ఏదీ రాకపోవడంతో ఎవరికీ ఓకే చెప్పలేదట. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మళ్లీ లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే మహేశ్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' హిట్ చిత్రానికి అనిల్ దర్శకత్వం వహించాడు. తాజాగా మరో కొత్త పాయింటుతో కూడిన కథతో ఆయన మహేశ్ ని సంప్రదించినట్టు చెబుతున్నారు.