- Home
- hollywood
కోల్ కతా కాలేజ్ మెరిట్ లిస్టులో టాపర్ గా సన్నీ
ఓ కాలేజీ ప్రకటించిన మెరిట్ లిస్టులో ఏకంగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరు వచ్చింది. అంతేకాదు టాపర్ కూడా ఆమే. నాలుగు సబ్జెక్టుల్లో ఆమెకు నూటికి నూరు మార్కులు వచ్చాయి. దీన్ని చూసిన వారంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు. చివరకు ఈ వార్త కాస్తా సన్నీలియోన్ వరకు వెళ్లింది. దీనిపై ఆమె స్పందిస్తూ, 'నెక్స్ట్ సెమిస్టర్ లో మీ అందరినీ కలుస్తా. నా క్లాసులో మీరంతా ఉంటారని భావిస్తున్నా' అని సరదాగా వ్యాఖ్యానించింది. దీనిపై కాలేజీ యాజమాన్యం కూడా స్పందించింది. ఇది ఎవరో కావాలనే చేశారని... దీనిపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని తెలిపింది.