కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసం అనుష్క

Admin 2020-08-12 18:40:41 entertainmen
బాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగుతున్న అనుష్క శర్మ... నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా ఐదు చిత్రాలను నిర్మించింది. వెబ్ సిరీసుల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో నిర్మించిన 'పాతాళ్ లోక్' సిరీస్ హిట్టైంది. ఈ సిరీస్ కు కూడా అనుష్కనే నిర్మాత. రానున్న రోజుల్లో మరిన్ని వెబ్ సిరీస్ లను నిర్మించాలనే యోచనలో అనుష్క ఉంది. మంచి కథనంతో మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. నటనకు ముగింపు పలకాలనే యోచనలో అనుష్క ఉందనేదే ఆ వార్త. కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసం అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకుంటున్నారు.