- Home
- bollywood
ఐటం పాట కోసం శ్రద్ధా కపూర్
'సాహో' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ మరోసారి తెలుగు సినిమాలో నటించే ఛాన్స్ కనిపిస్తోంది. అది కూడా అల్లు అర్జున్ తో కలసి చిందేసే అవకాశం కావడం విశేషం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగుకి అంతరాయం ఏర్పడింది. ఇక తన ప్రతి చిత్రంలోనూ ఓ ఐటం సాంగును పెట్టే దర్శకుడు సుకుమార్ ఇందులో కూడా మంచి జోష్ తో కూడిన ఐటం పాటను ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో నటించడానికి పలువురు కథానాయికలను పరిశీలించిన మీదట శ్రద్ధా కపూర్ ను సంప్రదించినట్టు, ఇది చేయడానికి ఆమె అంగీకరించినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.