'ఉప్పెన' హీరోయిన్‌లా ఉన్న అమ్మాయి..

Admin 2021-04-29 15:20:26 entertainmen
వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా 'ఉప్పెన' సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే.లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు బోలెడు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే, ఇప్ప‌టికే అచ్చం ఆమె పోలిక‌తో ఓ అమ్మాయి ప‌లు ద‌క్షిణాది సినిమాల్లో న‌టించింది. ఆమె ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అచ్చం కృతిశెట్టిలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కృతిశెట్టికి సోద‌రి అవుతుందా? అని కొంద‌రు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అచ్చం కృతిశెట్టిలా ఉన్న ఈ న‌టి పేరు విద్య విను మోహ‌న్.