కొరియన్ రీమేక్ గా 'శాకినీ .. ఢాకిని'

Admin 2021-05-04 20:14:26 entertainmen
తెలుగు తెరపై రీమేక్ ల జోరు పెరుగుతోంది. చాలావరకూ సెట్స్ పై ఉన్న సినిమాలు ఏదో ఒక రీమేక్ అనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'శాకినీ .. ఢాకిని' సినిమా కూడా 'మిడ్ నైట్ రన్నర్స్' అనే ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అని తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకుని రూపొందిస్తున్నారు. శాకినీగా రెజీనా ... ఢాకినిగా నివేద థామస్ నటిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నడిచే ఈ సినిమాకి మరో నిర్మాతగా సునీత తాటి వ్యవహరిస్తున్నారు.నివేద ఇద్దరూ కూడా ట్రైనీ పోలీసులుగా కనిపిస్తారట. అలాంటి వీరిద్దరూ ఓ అమ్మాయి కిడ్నాప్ కేసును ఛేదించవలసి వస్తుంది. అప్పుడు వాళ్లు ఏం చేశారు? పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రెజీనా .. నివేదా ఫైటింగులు కూడా చేసేస్తారట.