మహేశ్ బాబు తో త్రివిక్రమ్ మూడో మూవీ

Admin 2021-05-05 11:03:26 entertainmen
త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కథాకథనాలతో సాగుతాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితం కానున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై ఆందరిలో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ తన సినిమా టైటిల్స్ 'అ' అనే అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటాడు. 'అల వైకుంఠపురములో' సినిమా తరువాత, ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నాడనుకున్న సినిమాకి కూడా 'అయిననూ పోయిరావలే హస్తినకు' అనే టైటిల్ వినిపించింది. అందువలన మహేశ్ బాబుతో చేయనున్న సినిమాకి కూడా 'అ' అనే అక్షరంతోనే టైటిల్ మొదలవుతుందని అనుకున్నారు. తాజాగా 'పార్థు' టైటిల్ తెరపైకి వచ్చింది. 'అతడు' సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు ఇది.