- Home
- tollywood
'చెక్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్ట్స్ సంస్థ కొనుగోలు
'భీష్మ'తో భారీ విజయాన్ని అందుకున్నాడు యూత్ స్టార్ నితిన్. అయితే, ఈ ఏడాది మాత్రం అతడి కెరీర్ అంత సాఫీగా సాగడం లేదు. చెక్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన చంద్ర శేఖర్ ఏలేటి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.థియేటర్లలో నిరాశ పరిచిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. తాజాగా దీని విడుదల తేదీ వెలువడింది. 'చెక్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్ట్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మే 14 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.